Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:18 AM

సివిల్ దుస్తుల్లో పోలీసుల దాడి.. పేకాటలో ఐదుగురు అరెస్ట్

25-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్,

న్యాల్కల్ మండల పరిధిలోని ఓ ఖాళీ స్థలంలో అక్రమంగా పేకాట ఆడుతున్న వారిపై హద్నూర్ పోలీసులు సివిల్ దుస్తుల్లో ఆకస్మికంగా దాడి నిర్వహించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని హద్నూర్ ఎస్ఐ సుజిత్ తెలిపారు.పోలీసులు సాధారణ వ్యక్తుల్లా అక్కడికి చేరుకుని పేకాట ఆడుతున్న వారిని గమనించి, ఒక్కసారిగా దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,600 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్ఐ సుజిత్ మాట్లాడుతూ, మండలంలో పేకాట, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Sthanikam

సివిల్ దుస్తుల్లో పోలీసుల దాడి.. పేకాటలో ఐదుగురు అరెస్ట్

Article Image

న్యాల్కల్,

న్యాల్కల్ మండల పరిధిలోని ఓ ఖాళీ స్థలంలో అక్రమంగా పేకాట ఆడుతున్న వారిపై హద్నూర్ పోలీసులు సివిల్ దుస్తుల్లో ఆకస్మికంగా దాడి నిర్వహించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని హద్నూర్ ఎస్ఐ సుజిత్ తెలిపారు.పోలీసులు సాధారణ వ్యక్తుల్లా అక్కడికి చేరుకుని పేకాట ఆడుతున్న వారిని గమనించి, ఒక్కసారిగా దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,600 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్ఐ సుజిత్ మాట్లాడుతూ, మండలంలో పేకాట, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News