Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:11 PM

సిరిపురంలో శైవ వైభవం.. బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే వీరేశంకు ఆహ్వానం

14-02-2026 157 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామం శివమయంగా మారబోతోంది. శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించనున్నారు. గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది.

రేపు ఉదయం 8 గంటలకు రుద్రాభిషేకంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఈ నెల 16వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల 10 నిమిషాలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగనుంది. 17వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు రథోత్సవం నిర్వహించి బ్రహ్మోత్సవాలను వైభవంగా ముగించనున్నారు. ఈ సందర్భంగా భక్తుల రాకపోకలకు, అన్నదాన కార్యక్రమాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థాన వర్గాలు తెలిపాయి.

బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశంకు అందజేసి కార్యక్రమాలకు విచ్చేసి ఆశీర్వదించాలని గ్రామ పెద్దలు ఆహ్వానించారు. దేవస్థాన ఛైర్మన్ రాపోలు రమేష్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సిరెడ్డి, అఖిల భారత గౌడ పరిషత్ న్యాయవాది సుక్క శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సిరిపురంలో శైవ వైభవం.. బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే వీరేశంకు ఆహ్వానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News