Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

సిరిపురం ప్రతిష్ఠను ప్రపంచానికి చాటిన వరల్డ్ క్లాక్ ఆవిష్కరణ

07-02-2026 163 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిరిపురం:

సిరిపురం గ్రామానికి చెందిన మిత్రులు, గ్రామ వాసులు పున్న మల్లేశం నేత రూపొందించిన వినూత్న వరల్డ్ క్లాక్ ఆవిష్కరణ శుభ సందర్భంగా ఆయన స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లేశం,భాగ్యలక్ష్మిలను ఘనంగా సన్మానించారు.ఒకేసారి 176 దేశాలకు సంబంధించిన సమయాన్ని తెలుసుకునే అవకాశం కల్పించే వరల్డ్ క్లాక్ రూపకల్పన సిరిపురం గ్రామానికి మరింత గౌరవాన్ని తీసుకొచ్చిన మధుర ఘట్టంగా నిలిచింది. గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి చేరిన ఈ ఆవిష్కరణ అందరి మన్ననలను పొందింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా నేత మాట్లాడుతూ, మల్లేశం రూపొందించిన వరల్డ్ క్లాక్ అత్యంత అరుదైన, వినూత్న ఆలోచనకు నిదర్శనమని ప్రశంసించారు. ఒకే చోట ప్రపంచ దేశాల సమయాన్ని తెలుసుకునే విధంగా రూపొందించిన ఈ ఆవిష్కరణ నిజంగా అభినందనీయమని అన్నారు.ఇంతకుముందు మల్లేశం రూపొందించిన కలియుగ క్యాలెండర్కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ ఎక్సలెంట్ సంస్థల నుంచి ప్రశంసాపత్రాలు లభించడం సిరిపురం గ్రామానికే కాదు, తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మల్లేశం మేధస్సు మరిన్ని వినూత్న పరిశోధనలతో వెలుగొందాలని ఆకాంక్షించారు.

Sthanikam

సిరిపురం ప్రతిష్ఠను ప్రపంచానికి చాటిన వరల్డ్ క్లాక్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News