Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మానవత్వం చాటుకున్న మాజీ సర్పంచ్.. బాధిత కుటుంబానికి సాయం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 07:54 PM

సిరిపురంలో శివపార్వతుల కళ్యాణం వైభవం… భక్తులతో కళకళలాడిన దేవస్థానం

17-02-2026 119 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలోని శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానం లో సోమవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాల నినాదాల మధ్య నిర్వహించిన ఈ దివ్య కార్యక్రమం గ్రామాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో ముంచెత్తింది.

ఉదయం గణపతి పూజతో ప్రారంభమైన కార్యక్రమాలు రుద్ర నవగ్రహ పూజలు, హోమాలు, 108 కలశాల పవిత్ర జలాలతో అభిషేకంతో శాస్త్రోక్తంగా కొనసాగాయి. అనంతరం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా నిర్వహించారు.

కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి సమర్పించగా, పట్టు వస్త్రాలను సిరిపురం చేనేత సహకార సంఘం సమర్పించింది. భారీ ఊరేగింపు మధ్య స్వామివారి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు కళ్యాణ మండపానికి తీసుకువచ్చిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ రాపోలు రమేష్, ఉప సర్పంచ్ మూడు దొడ్ల అనూష రమేష్, వలిగొండ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సీతారామాంజనేయ స్వామి చైర్మన్ అప్పం రామేశ్వరం, మాజీ సర్పంచులు, ధర్మకర్తలు మరియు గ్రామ పెద్దలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Sthanikam

సిరిపురంలో శివపార్వతుల కళ్యాణం వైభవం… భక్తులతో కళకళలాడిన దేవస్థానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News