Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:21 AM

సిరిపురంలో శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా

18-02-2026 131 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రథోత్సవంలో గ్రామం మొత్తం శివనామస్మరణతో మారుమోగిన వేడుకలు

సిరిపురం గ్రామంలోని శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానం లో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.

సాయంత్రం 5.15 గంటలకు హోమం, బలిహరణ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవం జరిగింది. శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి విగ్రహాలను అలంకరించిన రథంపై గ్రామ పురవీధులలో ఊరేగించారు. డప్పుసప్పులు, భజనలు, కోలాటాలతో గ్రామం అంతా శివనామస్మరణతో మారుమోగింది. మహిళలు మంగళహారతులతో స్వామివారిని స్వాగతించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మూడు గుడ్ల అనుషా రమేష్, దేవస్థానం చైర్మన్ శ్రీరాపోలు రమేష్, ధర్మకర్తలు సూదిని చంద్రారెడ్డి, బలుగూరి లింగస్వామి, కొంగరి జంగయ్య, మామిడి చందన, దంతూరి యాదగిరి, సింగం నరసింహ, రాపోలు అమరేందర్, పున్న విష్ణుమూర్తి పాల్గొన్నారు.

అలాగే సీతారామాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ అప్పం రామేశ్వరం, మాజీ చైర్మన్ రాపోలు స్వామి, కొంగరి వెంకటేశం, తుంగ మార్కయ్య, మొగిలి శ్రీనివాసు, శివాలయం మాజీ చైర్మన్ పున్న శేషాద్రి, భజన మండలి చైర్మన్ చేపూరి సత్యనారాయణ, బండ శ్రీనివాస్ రెడ్డి, కూనూరు రమేష్, మాజీ ఉపసర్పంచ్ దాసిరెడ్డి శ్రవణ్ కుమార్, పున్న వెంకటేశం, వార్డు సభ్యులు గాదె యాదయ్య, కంకల అర్చన, మల్లేశం, మామిడి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సిరిపురంలో శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News