Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:17 AM

సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి

సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి

సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి
18-02-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండలంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి

పిఎసిఎస్ కేంద్రాల ద్వారా పారదర్శక పంపిణీ చేయాలని డిమాండ్

రామన్నపేట మండలంలో రైతులకు అవసరమైన మేర యూరియా ఎరువు అందుబాటులో ఉంచి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పిఎసిఎస్) కేంద్రాల ద్వారా పారదర్శకంగా పంపిణీ చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను అయోమయానికి గురిచేస్తున్న యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు.

సిపిఎం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ లాల్ బహుదూర్ కు, మండల వ్యవసాయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ, యూరియా విక్రయాన్ని యాప్‌కు పరిమితం చేయడంతో డీలర్లకు సమీపంలో ఉన్న రైతులకే సరఫరా జరుగుతుందని, చిన్న మరియు సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మండలంలో సుమారు 15 వేల యూరియా బస్తాల అవసరం ఉందని, కలుపు తీసే వ్యవధి ముగియబోతున్నందున వచ్చే పది రోజుల్లో యూరియా అత్యవసరమవుతుందని పేర్కొన్నారు. అధికారులు తక్షణం చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని, సింగిల్ విండో కేంద్రాల ద్వారా సరఫరా చేసి పారదర్శకంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యను వివరించినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి బోయిని ఆనంద్, కల్లూరి నాగేష్, కందుల హనుమంతు, గొరిగే సోములు, భావండ్లపల్లి బాలరాజు, శానకొండ రామచంద్రం, పల్లె సత్యం, వేముల మల్లేశం, కన్నెబోయిన రాజాలింగం, తాటిపాముల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News