Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

శోభనాద్రిపురంలో మహిళా గ్రామ సభ బెల్ట్ షాపుల నియంత్రణపై తీర్మానం

Updated : 09 Mar 2026 13:36 IST
As Preferred Source 1 min read
శోభనాద్రిపురంలో మహిళా గ్రామ సభ బెల్ట్ షాపుల నియంత్రణపై తీర్మానం

రామన్నపేట: మండలంలోని శోభనాద్రిపురం గ్రామ పంచాయతీ ఆవరణలో సోమవారం మహిళా గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ కంచి మధుసూదన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహిళా సాధికారత, మహిళా సమాఖ్యలు సాధిస్తున్న విజయాలు తదితర అంశాలపై చర్చించారు.

గ్రామంలో బెల్ట్ షాపులను నియంత్రించాలనే అంశంపై మహిళలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో మద్యపానం వల్ల ఏర్పడుతున్న సమస్యలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా గ్రామ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులను సభలో సన్మానించారు.

సమావేశంలో పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు, మహిళా సమాఖ్య సభ్యులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

శోభనాద్రిపురంలో మహిళా గ్రామ సభ బెల్ట్ షాపుల నియంత్రణపై తీర్మానం

Article Image

రామన్నపేట: మండలంలోని శోభనాద్రిపురం గ్రామ పంచాయతీ ఆవరణలో సోమవారం మహిళా గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ కంచి మధుసూదన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహిళా సాధికారత, మహిళా సమాఖ్యలు సాధిస్తున్న విజయాలు తదితర అంశాలపై చర్చించారు.

గ్రామంలో బెల్ట్ షాపులను నియంత్రించాలనే అంశంపై మహిళలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో మద్యపానం వల్ల ఏర్పడుతున్న సమస్యలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా గ్రామ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులను సభలో సన్మానించారు.

సమావేశంలో పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు, మహిళా సమాఖ్య సభ్యులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి