Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:39 AM

శ్రీ వైష్ణవి కళాశాల విద్యార్థుల ప్రభంజనం ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్, స్టేట్ ర్యాంకులు

13-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి పట్టణంలోని శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్‌తో పాటు రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించి ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల అభినందన సభ ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కళాశాల చైర్మన్, కరస్పాండెంట్ పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు.

అనంతరం కళాశాల ప్రిన్సిపల్, డైరెక్టర్ మధిర మల్లేశం మాట్లాడుతూ, భువనగిరి పట్టణంలోనే అత్యధిక మార్కులను సాధించి శ్రీ వైష్ణవి కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని తెలిపారు. ఐపీఈతో పాటు జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో అన్ని సౌకర్యాలతో బాలికల కోసం ప్రత్యేక హాస్టల్ వసతిని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెమొంటోలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రతిభ వివరాలు:

ద్వితీయ సంవత్సరం:

ఎంపీసీ: అభిరామ్ – 992/1000, భవ్య శ్రీ – 998/1000

బైపీసీ: అను – 990/1000, శిరీష – 986/1000

సీఈసీ: కీర్తన – 964/1000, శివాని – 963/1000

ప్రథమ సంవత్సరం:

ఎంపీసీ: ఇవాంజియల్ – 466/470, అపూర్వ, హర్షిత – 465/470

బైపీసీ: తేజశ్రీ, కారుణ్య – 463/440, శ్రీ వర్షిని – 434/440

సీఈసీ: ఫాతిమా – 488/500

ఎంఈసీ: అక్షర – 486/500

విద్యార్థుల ఈ అద్భుత ఫలితాలతో కళాశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించింది.

Sthanikam

శ్రీ వైష్ణవి కళాశాల విద్యార్థుల ప్రభంజనం ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్, స్టేట్ ర్యాంకులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News