Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:09 AM

సీపీఐ వందేళ్ల ఉత్సవాలకు మద్దతుగా ఆదోనిలో జనవరి 16న ర్యాలీ, పబ్లిక్ మీటింగ్ఆదోని, జనవరి 12: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) స్థాపనకు వందేళ్లు పూర్తయిన

12-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆదోని, జనవరి 12:

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) స్థాపనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా, జనవరి 18న ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ముందస్తు కార్యక్రమంగా ఆదోని పట్టణంలో జనవరి 16న ర్యాలీతో పాటు పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్నట్లు సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శులు కే. రమేష్ కుమార్, లక్ష్మీనారాయణ వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసిన సీపీఐ నాయకులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అంటించేందుకు రూపొందించిన స్టిక్కర్లను సోమవారం విడుదల చేశారు. ఈ స్టిక్కర్ల ద్వారా సీపీఐ వందేళ్ల పోరాట చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఖమ్మం బహిరంగ సభకు విస్తృత మద్దతు సమీకరించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్మికులు, రైతులు, యువత, సామాన్య ప్రజల హక్కుల కోసం సీపీఐ వందేళ్లుగా సాగిస్తున్న నిరంతర పోరాటాలకు ప్రతీకగా ఖమ్మంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అలాగే జనవరి 16న ఆదోనిలో జరగనున్న ర్యాలీ, పబ్లిక్ మీటింగ్‌ను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో AiYF పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్, రైతు సంఘం కార్యదర్శి బసాపురం గోపాల్, శాఖ కార్యదర్శి విజయ్, ఆటో యూనియన్ నాయకులు నరసింహులు, శ్రీరాములు, భాషా షేక్షావలి, నాగరాజు, వరప్రసాద్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీపీఐ వందేళ్ల ఉత్సవాలకు మద్దతుగా ఆదోనిలో జనవరి 16న ర్యాలీ, పబ్లిక్ మీటింగ్ఆదోని, జనవరి 12: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) స్థాపనకు వందేళ్లు పూర్తయిన

Article Image
ఆదోని, జనవరి 12:

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) స్థాపనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా, జనవరి 18న ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ముందస్తు కార్యక్రమంగా ఆదోని పట్టణంలో జనవరి 16న ర్యాలీతో పాటు పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్నట్లు సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శులు కే. రమేష్ కుమార్, లక్ష్మీనారాయణ వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసిన సీపీఐ నాయకులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అంటించేందుకు రూపొందించిన స్టిక్కర్లను సోమవారం విడుదల చేశారు. ఈ స్టిక్కర్ల ద్వారా సీపీఐ వందేళ్ల పోరాట చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఖమ్మం బహిరంగ సభకు విస్తృత మద్దతు సమీకరించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్మికులు, రైతులు, యువత, సామాన్య ప్రజల హక్కుల కోసం సీపీఐ వందేళ్లుగా సాగిస్తున్న నిరంతర పోరాటాలకు ప్రతీకగా ఖమ్మంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అలాగే జనవరి 16న ఆదోనిలో జరగనున్న ర్యాలీ, పబ్లిక్ మీటింగ్‌ను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో AiYF పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్, రైతు సంఘం కార్యదర్శి బసాపురం గోపాల్, శాఖ కార్యదర్శి విజయ్, ఆటో యూనియన్ నాయకులు నరసింహులు, శ్రీరాములు, భాషా షేక్షావలి, నాగరాజు, వరప్రసాద్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News