Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:39 PM

స్వగ్రామంలో న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్‌కు ఘన స్వాగతం. సర్పంచ్ సాయికుమార్ గౌడ్

01-02-2026 290 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పచ్చదనం–పరిశుభ్రతకు సందేశంగా మొక్కలు నాటిన ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో కోర్టు భవనాల శంకుస్థాపన అనంతరం హైకోర్టు న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్ స్వగ్రామం బోగారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ పూల బొకేలతో న్యాయమూర్తులు సహా ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు.

పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా బోగారం గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులు స్వయంగా మొక్కలు నాటి గ్రామస్థులకు పర్యావరణ పరిరక్షణపై స్పష్టమైన సందేశం ఇచ్చారు.ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ మొక్కలు మానవ జీవితానికి ప్రాణాధారం అని తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షిస్తేనే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందుతుందని పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలంటే, పాడిపంటలు పండాలంటే ప్రకృతిలో పచ్చదనం కీలకమని స్పష్టం చేశారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు బి. విజయసేనారెడ్డి, పి. శ్యామ్ కోసి, కే. శరత్, సృజన, కళాసికం, నర్సింగరావు నందికొండ, వాకిటి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా పోలీసు అధికారి అఖిలేష్ యాదవ్, సీనియర్ సివిల్ న్యాయాధికారి సబిత, జూనియర్ సివిల్ న్యాయాధికారి శిరీష హాజరయ్యారు.

Sthanikam

స్వగ్రామంలో న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్‌కు ఘన స్వాగతం. సర్పంచ్ సాయికుమార్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News