Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:18 AM

స్టేజి తొలగించవద్దంటూ ఎంపీడీవోకు వినతి

స్టేజి తొలగించవద్దంటూ ఎంపీడీవోకు వినతి

స్టేజి తొలగించవద్దంటూ ఎంపీడీవోకు వినతి
23-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని నీర్నెముల గ్రామానికి చెందిన హనుమాన్ యూత్ అసోసియేషన్ (Regd. No.160/2013) ఆధ్వర్యంలో గ్రామంలో నిర్మించిన సాంస్కృతిక వేదిక (స్టేజి)ను తొలగించవద్దని కోరుతూ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆఫీసులో సోమవారం వినతి పత్రం సమర్పించారు.

గ్రామంలోని పాత పాఠశాల ప్రాంగణంలో సంఘం స్వచ్ఛందంగా నిర్మించిన ఈ వేదిక గత కొన్ని సంవత్సరాలుగా గ్రామస్తుల సమావేశాలు, జాతీయ పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడుతోందని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామ యువత, పెద్దల సహకారంతో నిర్మించిన ఈ స్టేజి గ్రామ ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని తెలిపారు.

విద్యా, సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ఈ వేదిక ఎంతో అవసరమని, దీనిని తొలగిస్తే గ్రామంలో జరిగే కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్టేజిని యథాతథంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను కోరారు.

గ్రామ సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలగకుండా అధికారులు సహకరించాలని సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

స్టేజి తొలగించవద్దంటూ ఎంపీడీవోకు వినతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News