Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 12:13 PM

సర్పంచులు వార్డ్ మెంబర్లు 45 రోజుల్లో ఖర్చు నివేదికలు తప్పనిసరి లేదంటే ఎన్నికల బరిలో నిషేధం!

19-12-2025 123 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్నికల్లో ఖర్చు లెక్కలపై SEC కఠిన హెచ్చరిక!

45 రోజుల్లోగా నివేదికలు ఇవ్వకుంటే అనర్హత తప్పదు

స్థానిక ప్రతినిధి

TG: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులందరూ తప్పనిసరిగా తమ ఎన్నికల ఖర్చు వివరాలను 45 రోజుల్లోగా సంబంధిత ఎంపీడీవోలకు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) ఆదేశించింది.

ఈ గడువు లోపు ఖర్చు నివేదికలు అందజేయని పక్షంలో చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని SEC స్పష్టం చేసింది. గెలుపొందిన అభ్యర్థులైతే నేరుగా అనర్హత వేటు పడుతుందని హెచ్చరించింది.

అలాగే, ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలు సమర్పించని అభ్యర్థులకు మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే అర్హత ఉండదని కమిషన్ తేల్చిచెప్పింది.

పారదర్శకత, బాధ్యతాయుత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు SEC పేర్కొనగా, ఖర్చుల లెక్కల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని అభ్యర్థులకు స్పష్టమైన సందేశం ఇచ్చింది.

Sthanikam

సర్పంచులు వార్డ్ మెంబర్లు 45 రోజుల్లో ఖర్చు నివేదికలు తప్పనిసరి లేదంటే ఎన్నికల బరిలో నిషేధం!

Article Image

ఎన్నికల్లో ఖర్చు లెక్కలపై SEC కఠిన హెచ్చరిక!

45 రోజుల్లోగా నివేదికలు ఇవ్వకుంటే అనర్హత తప్పదు

స్థానిక ప్రతినిధి

TG: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులందరూ తప్పనిసరిగా తమ ఎన్నికల ఖర్చు వివరాలను 45 రోజుల్లోగా సంబంధిత ఎంపీడీవోలకు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) ఆదేశించింది.

ఈ గడువు లోపు ఖర్చు నివేదికలు అందజేయని పక్షంలో చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని SEC స్పష్టం చేసింది. గెలుపొందిన అభ్యర్థులైతే నేరుగా అనర్హత వేటు పడుతుందని హెచ్చరించింది.

అలాగే, ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలు సమర్పించని అభ్యర్థులకు మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే అర్హత ఉండదని కమిషన్ తేల్చిచెప్పింది.

పారదర్శకత, బాధ్యతాయుత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు SEC పేర్కొనగా, ఖర్చుల లెక్కల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని అభ్యర్థులకు స్పష్టమైన సందేశం ఇచ్చింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News