Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 12:10 PM

సర్పంచ్ ఎన్నికల్లో ఓటుకు రూ.40 వేలు.. రూ.17 కోట్లు ఖర్చు.. వెండి, బంగారం కూడా..!

15-12-2025 231 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి

రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల్లో డబ్బుల వర్షం కురుస్తోంది.

ఎలాగైనా పదవిని దక్కించుకోవాలని సర్పంచ్ అభ్యర్థులు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. కొన్ని చోట్ల లక్షలు కుమ్మరిస్తుండగా.. మరికొన్ని చోట్ల ఏకంగా కోట్లు ఖర్చు పెడుతున్నారు. డబ్బు, మద్యంతో గ్రామాలు మొత్తం నిండిపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ సర్పంచ్.. ఓటుకు రూ.40 వేలు పంచినట్లు తెలుస్తోంది. వెండి, బంగారం కూడా ఓటర్లకు ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా రూ.17 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో రెండో విడత పంచాయతీ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తి అయింది. ఇక చివరి విడత ఈనెల 17వ తేదీన జరగనుంది. ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో జోరుగా మద్యం, డబ్బు సరఫరా జరుగుతోంది. ఎన్నికల అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను మాత్రం అడ్డుకోలేక పోతున్నారు. ఇంటింటికీ వెళ్లి డబ్బు, మద్యం సరఫరా చేస్తూ.. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు.. ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తున్నారు. ఇక పోలింగ్‌కు ముందు రోజు.. భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రెండో విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ సర్పంచ్ అభ్యర్థి.. ఏకంగా రూ.17 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఓటుకు రూ.40 వేల చొప్పున పంచినట్లు తెలుస్తోంది.

సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పటాన్‌చెరు మండలానికి చెందిన ఓ గ్రామంలో.. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గెలిచిన ఓ సర్పంచ్‌ అభ్యర్థి.. గెలిచేందుకు రూ.17 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వార్తలు రావడం పెను సంచలనంగా మారింది. ఆ అభ్యర్థి.. గ్రామంలోని ఓటర్లందరికీ.. మూడు విడతల్లో డబ్బులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఇలా మూడు సార్లు కలిపి.. ఒక్కో ఓటరుకు రూ.40 వేల చొప్పున ఇచ్చినట్లు సమాచారం.

డబ్బు మాత్రమే కాకుండా వెండి, బంగారం, మద్యం కూడా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. కొందరు మహిళ ఓటర్లకు వెండి గ్లాసులు, చిన్న చిన్న బంగారు నగలను కూడా పంపిణీ చేసినట్లు సమాచారం. ఆ గ్రామంలో మొత్తం 780 ఇళ్లు ఉండగా.. అక్కడి ఓటర్లకు ఖరీదైన మద్యం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. కేవలం మద్యం కోసమే రూ.4 కోట్లు ఖర్చు చేసినట్లు స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. 8 రోజుల ఎన్నికల ప్రచారంలో.. కేవలం భోజనాల ఖర్చే రూ. కోటి దాటినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

మరోవైపు.. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలోనూ ధన ప్రవాహం జోరుగా సాగినట్లు తెలుస్తోంది. పలు మేజర్‌ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవికి పోటీ చేసిన అభ్యర్థులు సగటున రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. చేవెళ్ల డివిజన్‌లోని చేవెళ్ల, మొయినాబాద్‌, శంకర్‌పల్లి, షాబాద్‌ మండలాల్లో తక్కువలో తక్కువగా ఒక్కో ఓటుకు.. రూ.3 వేల నుంచి అత్యధికంగా.. రూ.15 వేల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Sthanikam

సర్పంచ్ ఎన్నికల్లో ఓటుకు రూ.40 వేలు.. రూ.17 కోట్లు ఖర్చు.. వెండి, బంగారం కూడా..!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News