Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:06 PM

సలహాలతో కాదు… డిమాండ్‌తోనే ఆదోని జిల్లా సాధ్యం!

17-02-2026 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అసెంబ్లీలో ఘాటు స్వరం లేకపోతే ఫలితం రాదు: జిల్లా సమితి హెచ్చరిక

ఆదోని: ఆదోని జిల్లా ఏర్పాటుపై అసెంబ్లీలో కేవలం సలహా మాదిరిగా ప్రస్తావించడం వల్ల ఫలితాలు రావని, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ స్పష్టమైన డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని ఆదోని జిల్లా సమితి అభిప్రాయపడింది. ఈ మేరకు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యలపై సమితి స్పందించింది.

ఆదోని జిల్లాకై ఐదు నియోజకవర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించడం, గత 94 రోజులుగా కొనసాగుతున్న రిలే దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, ప్రజా సంఘాల జేఏసి ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాలను అసెంబ్లీలో సమగ్రంగా ప్రస్తావించి ఉంటే ప్రభుత్వం పై మరింత ఒత్తిడి ఏర్పడేదని సమితి పేర్కొంది.

“ఉద్యమాలకు స్పందించని ప్రభుత్వం ముందు ‘ఇస్తే బాగుంటుంది’ అన్న సలహా ఇవ్వడం అమాయకత్వమే” అని సమితి విమర్శించింది. అయితే “గుడ్డికంటే మెల్ల మేలు” అన్నట్లుగా ఆదోని జిల్లా అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం స్వాగతించదగ్గ విషయమేనని తెలిపింది.

రాబోయే రోజుల్లో ఆదోని ప్రాంత నాయకులు మరింత దూకుడుగా పోరాడాలని, లేకపోతే ప్రజల తిరస్కారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా సమితి హెచ్చరించింది.

— ఎ. నూర్ అహ్మద్

వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆదోని జిల్లా సమితి

సంప్రదింపు: 7396511404

Sthanikam

సలహాలతో కాదు… డిమాండ్‌తోనే ఆదోని జిల్లా సాధ్యం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News