Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:24 AM

సారా కేసులో పాత నేరస్తులు బైండవర్

సారా కేసులో పాత నేరస్తులు బైండవర్

సారా కేసులో పాత నేరస్తులు బైండవర్
31-12-2025 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఏలూరు స్థానికం రిపోర్టర్ గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి, ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ వరిధిలో సంక్రాంతి సందర్భంగా అక్రమ నాటు సారా నియంత్రణలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఐదుగురుని చాట్రాయి తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ.మస్తానయ్య చెప్పారు. నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పాత నేరస్తులను బైండోవర్ చేశామన్నారు. వీరిలో ఒకరు బెల్లం వ్యాపారి కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఈ బైండ్ ఓవర్ కు ఒక సంవత్సరం కాల పరిమితి ఉంటుందని, ఈ కాల పరిమితిలో మరలా ఎక్సైజ్ నేరాలకు పాల్పడినచో, సంబంధిత వ్యక్తులపై లక్ష రూపాయలు జరిమానా విధించడంతో పాటు ప్రభుత్వ పథకాలు రద్దు చేయబడతాయని పాత నేరస్తులను అయన కఠినంగా హెచ్చరించారు. బైండోవర్ చేయబడిన పాత నేరస్తులు పోతనవల్లి గ్రామానికి చెందిన ధారావతు నాగరాజు, హస్సావతు విజయ, ధారావతు కుమార్, పోలవరం గ్రామానికి చెందిన బెల్లం వ్యాపారి సగ్గుల రవికుమార్, జనార్ధనవరం గ్రామానికి చెందిన బెజవాడ శ్రీనివాసరావులు ఉన్నట్లు ఆయన తెలిపారు. సారా వ్యాపారం చేసిన సారా కాచిన సమాచారం తెలియజేయాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మస్తానయ్య చెప్పారు.

Sthanikam

సారా కేసులో పాత నేరస్తులు బైండవర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News