Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:35 AM

సాగు చేసే రైతులకే రైతు భరోసా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

29-12-2025 29,205 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనర్హ భూములకు పెట్టుబడి సాయం నిలిపివేత

రైతు భరోసా మార్గదర్శకాలపై కీలక మార్పులు

హైదరాబాద్‌ స్థానికం ప్రతినిధి

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై నిజంగా సాగు చేసే రైతులకే రైతు భరోసా నిధులు అందించాలని నిర్ణయించింది. సాగుకు అనుకూలంగా లేని భూములకు గతంలో మాదిరిగా పెట్టుబడి సాయం ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పథకం అమలు, మార్గదర్శకాలపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయం చేయని వారు, బీడు భూములు, కొండలు, గుట్టలు, సాగుకు అనర్హమైన భూములకు కూడా గతంలో నిధులు వెళ్లినట్లు గుర్తించడంతో ఈ మార్పులు చేపట్టినట్లు సమాచారం.

గతంలో అమలులో ఉన్న పెట్టుబడి సాయం పథకంలో అనర్హులు లబ్ధి పొందినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అర్హులైన రైతులకు మాత్రమే న్యాయం జరిగేలా రైతు భరోసా పథకాన్ని మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇకపై క్షేత్రస్థాయిలో పంట సాగు జరుగుతున్న భూములను మాత్రమే గుర్తించి పెట్టుబడి సాయం అందించనున్నారు. సాగు లేని భూములకు నిధులు నిలిపివేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడమే కాకుండా, నిజమైన రైతుకు మేలు జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ నిర్ణయంతో రైతు భరోసా పథకం లక్ష్యభ్రంశం కాకుండా, ఉద్దేశ్యపూర్వకంగా అమలు కానుంది అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Sthanikam

సాగు చేసే రైతులకే రైతు భరోసా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Article Image

మీ స్పందన? 46 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News