Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 05:10 PM

రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు

07-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ సభ్యులు సమూహంగా లొంగిపోవడం విశేషంగా నిలిచింది. లొంగిపోయిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న మొత్తం 124 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో దేవ్‌జీ, బడే చొక్కారావు గన్‌మెన్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలోనే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని తెలిపారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు.

మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు, పోలీసులు తీవ్రంగా కృషి చేశారని సీఎం పేర్కొన్నారు. మావోయిస్టుల్లో నమ్మకం కల్పించడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారని అన్నారు. దేవ్‌జీ మరియు ఆయన మిత్రబృందం కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. వారి సమస్యలను పరిష్కరిస్తే లొంగిపోతామని వారు పేర్కొన్నారని చెప్పారు.

రాష్ట్ర స్థాయిలో చేయగలిగిన చర్యలన్నీ తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత గణపతి సహా తెలంగాణకు చెందిన మరో ఏడుగురు త్వరగా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి పునరావాసంతో పాటు రివార్డు కూడా అందజేస్తామని తెలిపారు. వారికి ప్రత్యేక ఆరోగ్య భద్రత కార్డులు కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Sthanikam

రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News