Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డెడ్ స్టోరేజ్‌లో కూడా రైతాంగానికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్,బీఆర్ఎస్ ప్రభుత్వానిది అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 07:42 AM

రాయికుంటపల్లి గ్రామ ప్రజల కల నెరవేరిన శుభదినం

10-01-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రజల నమ్మకానికి ప్రతిఫలం – రాయికుంటపల్లి 12వ వార్డులో రేషన్ షాప్ ప్రారంభం.

గ్రామ పంచాయతీ సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్,

12వ వార్డు సభ్యులు జూకంటి మధు

స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా, మోటకొండూరు మండల పరిధిలోని రాయికుంటపల్లి గ్రామం 12వ వార్డులో సబ్ సెంటర్ రేషన్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గత పది సంవత్సరాలుగా గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్న రేషన్ షాప్ కోరిక నేడు సాకారమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య సహకారంతో,ఇచ్చిన మాట ప్రకారం సర్పంచ్ భూమండ్ల జయమ్మ,శ్రీనివాస్ ఆధ్వర్యంలో 12వ వార్డులో సబ్ సెంటర్ రేషన్ షాప్ ప్రారంభించబడింది.గెలుపొందిన వెంటనే రాయికుంటపల్లి గ్రామం 12వ వార్డు నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ పాలకవర్గం, ప్రజల అవసరాలను గుర్తించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో భాగంగా,పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ సన్నబియ్యం పంపిణీ ఈ సందర్భంగా ప్రారంభించబడింది.ఇంతకు ముందు రాయికుంటపల్లి గ్రామ ప్రజలు రేషన్ బియ్యం కోసం మోటకొండూరు వరకు వెళ్లాల్సి రావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను ప్రజలు పదే పదే గత పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం, గెలిచిన వెంటనే ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది.12వ వార్డు సభ్యులు జూకంటి మధు సహకారంతో, కొబ్బరికాయలు కొట్టి, స్వీట్లు పంపిణీ చేస్తూ సబ్ సెంటర్ రేషన్ షాప్‌ను ప్రజల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.రాయికుంటపల్లి ప్రజల ఇబ్బందులను వెంటనే స్పందించి, మా మీద నమ్మకం ఉంచి అమలు చేసిన బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి – పేదల పెన్నిధి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన సంబంధిత అధికారులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఉపసర్పంచ్ గారు, పాలకవర్గ సభ్యులు,ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా,నా విజ్ఞప్తిని మన్నించి 12వ వార్డులో ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

Sthanikam

రాయికుంటపల్లి గ్రామ ప్రజల కల నెరవేరిన శుభదినం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News