Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:12 PM

రావన్నపేటకు గర్వకారణం… జాతీయ స్థాయికి ఎదిగిన గొరిగె సోములు

11-02-2026 186 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జాతీయ కమిటీలో గొరిగె సోములు

భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయు)కి తెలంగాణ ప్రతినిధిగా ఎంపిక

రావన్నపేట, భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయు అనుబంధం) జాతీయ కమిటీ సభ్యుడిగా రావన్నపేట పట్టణానికి చెందిన గొరిగె సోములు ఎన్నికయ్యారు. రాజస్థాన్ రాష్ట్రం సికర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన అఖిల భారత మహాసభల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోములను జాతీయ కమిటీలోకి ఎన్నుకున్నారు.ప్రస్తుతం సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శిగా, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సోములు జిల్లా వ్యాప్తంగా నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు సాగిస్తున్నారు.ఈ సందర్భంగా సోములు మాట్లాడుతూ నిర్మాణ రంగ కార్మికులను ఏకం చేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరింత బలమైన ఉద్యమాలు చేపడతామని తెలిపారు. జాతీయ కమిటీలో బాధ్యతలు అప్పగించినందుకు నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

జాతీయ కమిటీలోకి ఎన్నికైన సోములను సీఐటీయు మండల నాయకులు బొడ్డుపల్లి వెంకటేశం, నకిరేకంటి రాము, వంగాల మారయ్య, అప్పం సురేందర్, పల్లె సత్యం తదితరులు అభినందించారు.

Sthanikam

రావన్నపేటకు గర్వకారణం… జాతీయ స్థాయికి ఎదిగిన గొరిగె సోములు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News