Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:16 AM

రసిక రాజా – అనంతసాగరం తహసీల్దార్ సస్పెన్షన్

రసిక రాజా – అనంతసాగరం తహసీల్దార్ సస్పెన్షన్

రసిక రాజా – అనంతసాగరం తహసీల్దార్ సస్పెన్షన్
06-03-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో తహసీల్దార్‌గా పనిచేస్తున్న జయవర్ధన్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేశారు. మండల కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని తీవ్రంగా వేధిస్తూ, లైంగికంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

ఈ వేధింపులను భరించలేక బాధితురాలు రెవెన్యూ డివిజనల్ అధికారికి (ఆర్డీఓ) ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై ఆర్డీఓ అన్ని కోణాల్లో విచారణ చేపట్టగా, తహసీల్దార్ జయవర్ధన్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమని తేలింది.

విచారణ నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించగా, ఆ నివేదిక ఆధారంగా తహసీల్దార్ జయవర్ధన్‌ను వెంటనే సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కార్యాలయాల్లో మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Sthanikam

రసిక రాజా – అనంతసాగరం తహసీల్దార్ సస్పెన్షన్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News