Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
205 రోజులుగా ఎదురుచూపులే.. తనకు న్యాయం చేయాలని విలేకరి వేడుకోలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:55 PM

రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం..!

రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం..!

రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం..!
18-02-2026 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పంటల నమోదు సర్వేకు 10,909 మంది నియామకం – ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లింపు

హైదరాబాద్:

రాష్ట్రంలో పంటల నమోదు సర్వే నిర్వహణ కోసం ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున మొత్తం 10,909 మందిని నియమించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. యాసంగి సీజన్‌లో పంటల వివరాలను సేకరించి ఫొటోలు తీసి నమోదు చేయడం వీరి ప్రధాన బాధ్యతగా ఉంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివి, గ్రామ భూములపై అవగాహన కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎంపికైన వాలంటీర్లకు తీసిన ప్రతి ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లింపు అందుతుంది. 45 రోజుల యాసంగి సీజన్‌లో గరిష్టంగా 2000 ఫొటోలు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో సంబంధిత మండల వ్యవసాయ అధికారుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పంటల సర్వే ప్రక్రియను వేగవంతం చేయడం, రైతుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ పేర్కొంది.

Sthanikam

రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం..!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News