Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:14 PM

రామన్నపేటలో న్యాయవాదుల విధుల బహిష్కరణ

రామన్నపేటలో న్యాయవాదుల విధుల బహిష్కరణ

రామన్నపేటలో న్యాయవాదుల విధుల బహిష్కరణ
05-02-2026 117 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్

రామన్నపేటలో న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.మొయినాబాద్‌లో జరిగిన యువ న్యాయవాది స్వప్న హత్యను తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు ఎండీ మజీద్ మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు పునరావృతం కాకుండా తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిరంతరం న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆస్తి కోసం ఇలాంటి దాడులు, హత్యలు చేయడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఆస్తి వివాదాల పరిష్కారానికి కోర్టులను ఆశ్రయించాల్సిందే తప్ప హింసకు పాల్పడకూడదని సూచించారు.ఈ సందర్భంగా యువ న్యాయవాది స్వప్న మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మశాంతి కోసం న్యాయవాదులు నిమిషం పాటు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు యాదాసు యాదయ్యతో పాటు సీనియర్ న్యాయవాదులు జినుకల ప్రభాకర్, కేమ రామదాసు, బసరాజు, అశోక్ కుమార్, జగతయ్య, శ్రీశైలం, కూనూరు శ్రీనివాస్, నూతి రమేష్, సతీష్ రెడ్డి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో న్యాయవాదుల విధుల బహిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News