Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:34 PM

రామన్నపేటలో కుష్ఠు వ్యాధి అవగాహన కార్యక్రమం

31-01-2026 186 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామపంచాయతీ వద్ద స్పర్శ్ కుష్ఠు వ్యాధి అవగాహన కార్యక్రమంలో భాగంగా శని వారం రామన్నపేటలో అవగాహన, ప్రతిజ్ఞ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గోపాల్ ఆరోగ్య విస్తరణాధికారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద, అలాగే రామన్నపేట బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కుష్ఠు వ్యాధి మైకో బ్యాక్టీరియం లెప్రో అనే సూక్ష్మజీవి వల్ల కలిగే అంటువ్యాధి అని తెలిపారు. శరీరంపై స్పర్శ లేని, రాగి రంగులో కనిపించే, వెంట్రుకలు లేని, మెరుస్తూ కనిపించే మచ్చలు కుష్ఠు వ్యాధి లక్షణాలు కావచ్చని వివరించారు. అటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించాలని, ఆశా కార్యకర్తల సహాయంతో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

కుష్ఠు వ్యాధిగ్రస్తులను తొందరగా గుర్తించి, సమయానికి చికిత్స తీసుకుంటే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చని తెలిపారు. వ్యాధి రకాన్ని బట్టి ఆరు నెలలు లేదా పన్నెండు నెలలు పూర్తిస్థాయిలో మందులు వాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 2027 నాటికి కుష్ఠు రహిత భారతదేశాన్ని సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు.అనంతరం విద్యార్థులతో కుష్ఠు వ్యాధి నివారణపై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట గ్రామ సర్పంచ్ గరికపాటి సత్యనారాయణ, ఉప సర్పంచ్ మొటే రమేష్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్ లు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో కుష్ఠు వ్యాధి అవగాహన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News