Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:24 AM

రామన్నపేటలో కల్తీ యూరియా కలకలం. రైతులను మోసం చేస్తున్న డీలర్లు?

21-02-2026 191 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నేత నరేష్ డిమాండ్

రామన్నపేట: జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న వేళ, రామన్నపేట మండలంలో కల్తీ యూరియా వ్యవహారం బయటపడటం కలకలం రేపుతోంది. బీఎస్పీ మండల అధ్యక్షుడు నకిరేకంటి నరేష్ ఆరోపణలతో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఆన్లైన్‌లో బుక్ చేసుకుని రామన్నపేటలోని ప్రైవేట్ డీలర్ల వద్ద కొనుగోలు చేసిన యూరియా నకిలీగా ఉన్నట్లు కొమ్మాయిగూడానికి చెందిన రైతులు నరసింహ, గణేష్ ఫిర్యాదు చేశారు. ఇటీవల 6 బస్తాలు కొనుగోలు చేసి అందులో 3 బస్తాలు తెరిచి చూడగా, యూరియా బదులుగా నల్లటి మట్టి పెళ్లలు కనిపించాయని వారు ఆరోపించారు.

ఈ విషయాన్ని తాను స్వయంగా పరిశీలించానని నరేష్ పేర్కొన్నారు. ప్రముఖ కంపెనీ పేరుతో ఉన్న బస్తాల్లో ఇలా కల్తీ పదార్థం ఉండటం ఆందోళనకరమని అన్నారు. అదేవిధంగా బస్తాల బరువు కూడా తక్కువగా ఉన్నట్లు రైతులు వాపోయారని తెలిపారు.

జిల్లాలో రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగి సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ షాపులను తనిఖీ చేసి అవసరమైతే అనుమతులు రద్దు చేయాలని నరేష్ డిమాండ్ చేశారు.

Sthanikam

రామన్నపేటలో కల్తీ యూరియా కలకలం. రైతులను మోసం చేస్తున్న డీలర్లు?

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News