Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:37 PM

రాజమండ్రిలో తెలంగాణ 108… నిబంధనల ఉల్లంఘనపై చర్చ

22-03-2026 173 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అత్యవసర సేవలకు కేటాయించిన 108 అంబులెన్స్ పక్క రాష్ట్రంలో ప్రత్యక్షమవ్వడం వివాదాస్పదమైంది. హైదరాబాద్ ఈసీఐఎల్‌కు చెందిన వాహనం నిజాంపేట్ మార్గంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి చేరినట్లు జీపీఎస్ ఆధారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా 108 సేవలు రాష్ట్ర పరిధిలోనే ఉండాలని నిబంధనలు పేర్కొంటాయి. అలాంటప్పుడు వాహనం ఇతర రాష్ట్రానికి వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. ఇది రోగి తరలింపుకోసమా? లేక ఇతర కారణాల కోసమా? అన్నది స్పష్టత లేని అంశంగా మారింది.

ఈ విషయంపై అంబులెన్స్ సిబ్బందిని సంప్రదించగా, వాహనం రాజమండ్రిలో ఉన్న విషయం నిజమేనని అంగీకరించినప్పటికీ, పై అధికారుల ఆదేశాలపై వివరాలు తెలియదని తెలిపారు.

ఇక, స్థానికంగా అత్యవసర సేవలు అవసరమైన సమయంలో అంబులెన్స్ అందుబాటులో లేకపోతే బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై 108 ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Sthanikam

రాజమండ్రిలో తెలంగాణ 108… నిబంధనల ఉల్లంఘనపై చర్చ

Article Image

మీ స్పందన? 6 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News