రాఘవ్ చద్దా రాజ్యసభలో 'డేటా లీక్ దుర్మార్గం'పై గట్టి ప్రశ్నలు!
రాఘవ్ చద్దా రాజ్యసభలో 'డేటా లీక్ దుర్మార్గం'పై గట్టి ప్రశ్నలు!
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
"క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయింది"... మా డేటా ఎక్కడి నుంచి? - రాఘవ్ ఆగ్రహం
రాజ్యసభలో బడ్జెట్ సమావేశాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మాట్లాడిన ప్రసంగం సంచలనం సృష్టించింది. ప్రతి సామాన్యుడి జీవితంలో రోజూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను లేవనెత్తి, ప్రభుత్వం, కంపెనీలపై తీవ్ర ప్రశ్నలు రేకెత్తించారు. మన నంబర్‌లు ఎవరికీ ఇవ్వకపోయినా ప్రతిరోజూ 8-10 స్పామ్ కాల్‌లు వస్తున్నాయి - "సార్, మీ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయింది", "మేడమ్, పర్సనల్ లోన్ కావాలా?" అని. ఈ డేటా ఎక్కడి నుంచి వస్తోంది? మనవ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉందా? అని రాఘవ్ చద్దా గట్టిగా ప్రశ్నించారు.
"డిజిటల్ఇండియా" గురించి గొప్పలుగా మాట్లాడుకుంటున్నాం. ఆన్‌లైన్ యాప్స్, KYCలతోమన డేటా షేర్ చేస్తున్నాం. కానీ మా ప్రైవసీకి (గోప్యతకు) ఏ విలువ ఉంది? అనుమతి లేకుండా మన సమాచారం అమ్ముతున్నారా? అని రాఘవ్ ప్రశ్నలు వేశారు.భారతదేశంలో 90 కోట్లకు పైగా ఆధార్ కార్డులు, 115 కోట్ల మొబైల్ వినియోగదారులు ఉన్నారు. ఈ భారీ డేటా లీక్ అయితే ప్రజల ఆర్థిక, వ్యక్తిగత భద్రత ప్రమాదంలో పడుతుంది. గతంలో జియో, భారతీ ఎయిర్‌టెల్, పేటీఎం వంటి కంపెనీల్లో డేటా బ్రీచ్‌లు జరిగాయి. ప్రతి సందర్భంలో కంపెనీలు కేవలం క్షమాపణలు చెప్పి తప్పించుకున్నాయి.
రాఘవ్ చద్దా ప్రసంగం సామాన్య ప్రజల మనసుల్ని గెలుచుకుంది. "ఇది ఒక్కరి ప్రశ్న కాదు, ప్రతి భారతీయుడి ఆందోళన" అని చెప్పి, ప్రజల డేటా భద్రత కోసం కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం డేటా ప్రొటెక్షన్ బిల్ పేండింగ్‌లో ఉంది. EUలో GDPR చట్టం లాగా భారత్‌లో కూడా డేటా లీక్‌లకు భారీ జరిమానాలు విధించే వ్యవస్థ రావాలని ఆయన సూచించారు. "ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు మన డేటాను సురక్షితంగా ఉంచాలి. లీక్ అయితే శిక్ష ఖాయం" అని రాఘవ్ హెచ్చరించారు.
సోషల్ మీడియాలో #DataLeakScam, #RaghavChadhaSpeech హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. వినియోగదారులు తమ అనుభవాలు షేర్ చేస్తున్నారు. ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ "డేటా సెక్యూరిటీపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది" అని తెలిపారు. రాఘవ్ ప్రసంగం TRAI, IT మంత్రిత్వ శాఖలపై ఒత్తిడి పెంచింది.ఈసందర్భంలో డేటా ప్రొటెక్షన్ బిల్ వేగంగా ఆమోదం పొంది అమలు అవ్వాలి. కంపెనీలు KYC, ఆధార్ లింకింగ్‌లో మన డేటాను అమ్మకుండా సురక్షితంగా ఉంచాలి.ప్రజలు తమ డేటాను రక్షించుకోవడానికి Do Not Disturb రిజిస్ట్రేషన్, స్పామ్ రిపోర్టింగ్ వాడాలి. రాఘవ్ చద్దా ప్రసంగం సామాన్య ప్రజల గొంతుకు బలం చేకూర్చింది. డిజిటల్ భారత్‌లో ప్రైవసీ హక్కు కాపాడాలంటే ఇలాంటి చర్చలు కీలకం.
ప్రభుత్వం డేటా లీక్‌లపై విచారణకు ఆదేశాలు జారీ చేస్తుందని అంచనా. రాఘవ్ చద్దా ప్రసంగం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ప్రతి పౌరుడి డేటా సురక్షితంగా ఉండే వ్యవస్థ రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి