Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:42 AM

పులికనుమ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రాలయం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి

పులికనుమ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రాలయం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి

పులికనుమ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రాలయం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి
February 04, 2026 07:12 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కోసిగి:

మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి పులికనుమ సాగునీటి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు పరిస్థుతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి, నీటి నిల్వలు, రైతులకు అందుతున్న సాగునీటి సరఫరా అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పులికనుమ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో రాయలసీమ కరువు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అనేక కీలక సాగునీటి ప్రాజెక్టులు రూపకల్పన చేసి అమలు చేశారని తెలిపారు.కూటమి ప్రభుత్వ 19 నెలల పాలనలోనే రాయలసీమ సాగునీటి రంగానికి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. ముఖ్యంగా హంద్రి–నీవా ప్రాజెక్టును మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల వ్యయంతో పూర్తి చేసి సుమారు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పారు. కేవలం 190 రోజుల్లో నలభై టీఎంసీల నీటిని తరలించి రికార్డు సృష్టించామని తెలిపారు.ప్రస్తుతం రాయలసీమలోని ప్రధాన, మధ్యస్థ, చిన్న జలాశయాలను కలిపి నాలుగు వందల అరవై నాలుగు టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గాను మూడు వందల అరవై ఆరు టీఎంసీల నీరు నిల్వ ఉండటం కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. చెరువులు, జలాశయాలు జలకళతో కళకళాడుతున్నాయని పేర్కొన్నారు.

అదే సమయంలో గత వైసీపీ పాలనలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని ఆయన గుర్తుచేశారు. ఐదేళ్ల పాలనలో 102 సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసి సీమను ఎడారి చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు.

తుంగభద్ర డ్యామ్ క్రెస్ట్ గేట్లు దెబ్బతిన్న సమయంలో కూటమి ప్రభుత్వం కేవలం ఐదు రోజుల్లో మరమ్మత్తులు పూర్తి చేసి సుమారు నలభై టీఎంసీల నీటిని కాపాడిందని తెలిపారు. ఇదే పాలనలో గోదావరి మిగులు జలాలను రాయలసీమకు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.పులికనుమ ప్రాజెక్టు వంటి సాగునీటి ప్రాజెక్టులు రైతులకు ప్రాణాధారమని, రాయలసీమ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాగునీటి రంగానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామని రాఘవేంద్ర రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కోసిగి మండల నాయకులు ముత్తరెడ్డి, మండల అధ్యక్షులు రామిరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ నర్సిరెడ్డి, సొసైటీ చైర్మన్ అయ్యన్న, సాతనూరు కోసిగయ్య, హోలగుంద కోసిగయ్య, షోరూం వీరేష్, ఎస్. వీరన్న, దొడ్డి రంగారెడ్డి, గోపాలు, చింతకుంట హనుమంతు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నేతలు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News