Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:22 AM

పోటీ పరీక్షల్లో ఆంగ్ల భాష కీలకం: డా. సిహెచ్ శ్యాంసుందర్

23-02-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: నేటి పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషపై పట్టు సాధించటం అనివార్యమని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆంగ్ల అధ్యాపకులు డా. సిహెచ్. శ్యాంసుందర్ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో “పోటీ పరీక్షల్లో ఆంగ్ల భాష ప్రాధాన్యత” అంశంపై నిర్వహించిన అతిథి ఉపన్యాసంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు.

అంతర్జాతీయ భాషగా గుర్తింపు పొందిన ఆంగ్లానికి నేటి విద్యా, ఉపాధి రంగాల్లో ప్రత్యేక స్థానం ఉన్నదని ఆయన వివరించారు. గ్రూప్ డిస్కషన్లు, ఇంటర్వ్యూల్లో వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేది భాషా ప్రావీణ్యమేనని పేర్కొన్నారు. పదసంపద పెంపు, వ్యాకరణంపై పట్టు, కమ్యూనికేషన్ నైపుణ్యాల సాధన ద్వారా పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ, ఆంగ్ల భాషలో నైపుణ్యం ఉన్నవారికి దేశ విదేశాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని అన్నారు. విద్యార్థులు నిరంతర సాధనతో భాషా దిట్టలుగా మారాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆంగ్ల విభాగాధిపతి డా. ఎం. లక్ష్మీ నీలిమ, అధ్యాపకురాలు రాధికతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉపన్యాసం అనంతరం విద్యార్థులతో పరస్పర చర్చ నిర్వహించగా, పోటీ పరీక్షలపై పలు సందేహాలకు సమాధానాలు లభించాయి.

Sthanikam

పోటీ పరీక్షల్లో ఆంగ్ల భాష కీలకం: డా. సిహెచ్ శ్యాంసుందర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News