Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:20 PM

పోస్టల్ బ్యాలెట్‌కు ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

07-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల ఓటు హక్కు తప్పక వినియోగించాలి

ఫిబ్రవరి 8, 9న జిల్లావ్యాప్తంగా సౌకర్యం

మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు తెలిపారు.

జిల్లాలో ఫిబ్రవరి 8, 9 తేదీలలో భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీ పరిధుల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లుగా ఉండి ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తమ ఎన్నికల విధి ఉత్తర్వులు, ఓటరు గుర్తింపు కార్డు, పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసిన ఫారం–12తో సంబంధిత సౌకర్య కేంద్రానికి హాజరుకావాలని తెలిపారు. సౌకర్య కేంద్రంలోనే పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసి, వెంటనే ఓటు నమోదు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

అధికారులు ఓటు వేసిన అనంతరం సంతకం చేసిన పోస్టల్ బ్యాలెట్‌ను అదే రోజు అదే సౌకర్య కేంద్రంలో సమర్పించాల్సిందిగా తెలిపారు. ప్రతి ఎన్నికల సిబ్బంది తన ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి పిలుపునిచ్చారు.

Sthanikam

పోస్టల్ బ్యాలెట్‌కు ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News