Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 26, 2026 12:35 AM

పోరాట యోధురాలు జెట్టి ఈశ్వరీబాయి వర్ధంతి: SCలకు సభలో గొంతుకు ప్రతీక!

పోరాట యోధురాలు జెట్టి ఈశ్వరీబాయి వర్ధంతి: SCలకు సభలో గొంతుకు ప్రతీక!

పోరాట యోధురాలు జెట్టి ఈశ్వరీబాయి వర్ధంతి: SCలకు సభలో గొంతుకు ప్రతీక!
February 25, 2026 10:56 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

"వెధవా" అన్న మంత్రిని చెప్పుతో కొట్టిన ధీరవనిత.. బానిసల్లా తల ఊపే దద్దమ్మలకు గుర్తు!

మాలల రాజ్యాధికార సాధన సమితి సందర్భంగా పోరాట యోధురాలు జెట్టి ఈశ్వరీబాయి వర్ధంతిని ఘనంగా జరుపుకుంది. SC సామాజిక వర్గాలకు శాసనసభల్లో నిజమైన ప్రతినిధులు అంటే ఈశ్వరీబాయి లాంటి వాళ్లే అని స్పష్టం చేస్తూ, ఆమెధీరత్వాన్ని, పోరాట స్ఫూర్తిని గుర్తు చేశారు. కంచికచర్ల కోటేసు హత్య కేసు అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు రెడ్డి కుల మంత్రి "దొంగతనం చేసినోడిని స్థంబానికి కట్టేసి తగల్చడంలో తప్పేముంది" అని నోరు జారిన వెంటనే ఈశ్వరీబాయి సివంగిలా మారారు. అందరూ చూస్తుండగా "వెధవా" అని చెప్పుతో ఆమంత్రిని కొట్టి, సభ సభ్యులు ఆమెను శాంతింపజేయడానికి కష్టపడ్డారు.

1918 డిసెంబర్ 1న హైదరాబాద్ చిలకలగూడలో సామాన్య మాల కుల కుటుంబంలో జన్మించిన జెట్టి ఈశ్వరీబాయి జీవితం అణగారిన వర్గాలకు వెలుగు రాయి. తరతరాలుగా బానిసత్వంలో మునిగి ఉన్న SCలకు విముక్తి కల్పించడానికి ఆమె చేసిన పోరాటం చరిత్రలో అక్షరాలుగా నిలిచిపోయింది. సికింద్రాబాద్‌లో ఉపాధ్యాయిణిగా పనిచేస్తూ, చిలకలగూడలో 'గీతా విద్యాలయం' స్థాపించి వెనుకబడిన మహిళలకు చదువు, చేతివృత్తి శిక్షణ ఇచ్చి స్వావలంబన చేశారు. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్‌లో భాగస్వామిగా దళితోద్యమానికి పునాదులు వేశారు.

1969 తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజా సమితి వైస్ ప్రెసిడెంట్‌గా పోరాడి, ప్రధాన నాయకులు జైలులో ఉన్నప్పుడు ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టారు. 1972లోనిజామాబాద్ ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా గెలిచి, అసెంబ్లీలో అణగారిన వర్గాల గొంతుకయ్యారు. అంబేద్కర్సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి, పేదల గుడిసెల్లో సేద తీర్చుకుని, కారం బువ్వ, పచ్చడి మెతుకులతో జీవితం గడిపారు. 1991 ఫిబ్రవరి 24న తుది శ్వాస విడిచారు.

ఈశ్వరీబాయి లాంటి నిజమైన పోరాట యోధలు లేకపోతే, ఇప్పుడు SC రిజర్వేషన్ సీట్లలో బానిసల్లా తల ఊపే దద్దమ్మలు కనిపిస్తారు. కుల దోపిడీ, అన్యాయాలకు వెంటనే స్పందించి, మంత్రులను కూడా టార్గెట్ చేసిన ధీరత్వం ఆమె ప్రత్యేకత. మాలల రాజ్యాధికార సాధన సమితి ఈ వర్ధంతి సందర్భంగా ఆమె జీవిత చరిత్రను పునరుద్ఘాటించి, యువతకు స్ఫూర్తిగా చేస్తోంది.

ఈశ్వరీబాయి పేరు మహిళా వర్సిటీకి పెట్టాలని, ఆమె స్ఫూర్తితో పోరాడాలని సమాజం డిమాండ్. SC, STలకు నిజమైన ప్రతినిధులు రావాలంటే ఈశ్వరీబాయి లాంటి నాయకులే కావాలి. ఆమెకు ఘన నివాళులు అర్పిస్తూ, ఆమె ఆదర్శాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా తెలంగాణా అంతటా సమావేశాలు జరిగాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News