Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

పోలీసుల శ్రమ ఫలించింది… తప్పిపోయిన విద్యార్థి ఆచూకీ లభ్యం

06-02-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తప్పిపోయిన విద్యార్థి ఆచూకీ కనిపెట్టిన పోలీసులు

తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం

ఎవరికి చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్లిపోయిన

విద్యార్థి ఆచూకీని గుర్తించిన నార్కెట్‌పల్లి పోలీసులు, అతడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించి వారి ఆవేదనను తీర్చారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నార్కెట్‌పల్లి బీసీ హాస్టల్‌లో 10వ తరగతి చదువుతున్న నూకల శశాంక్ (15) (తండ్రి: లేట్ నరసింహ, కులం: యాదవ్, గ్రామం: అన్నెపర్తి, నల్లగొండ జిల్లా) బుధవారం ఉదయం హాస్టల్ నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే అతని తల్లిదండ్రులకు సమాచారం అందించి, కలిసి గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు.

దీంతో అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన నార్కెట్‌పల్లి ఎస్సై పి. విష్ణుమూర్తి, బాలుడి ఆచూకీ కోసం కానిస్టేబుళ్లు సత్యనారాయణ, గిరిబాబులను నియమించారు. వారు శోధన కొనసాగిస్తూ గురువారం ఉదయం 9 గంటల సమయంలో భువనగిరి బస్టాండ్‌లో బాలుడిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.ఎస్సై సమక్షంలో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడి ఆచూకీని వేగంగా గుర్తించిన కానిస్టేబుళ్లను ఎస్సై అభినందించారు. అలాగే, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకుపాల్పడకూడదని విద్యార్థికి సూచనలు ఇచ్చారు.

Sthanikam

పోలీసుల శ్రమ ఫలించింది… తప్పిపోయిన విద్యార్థి ఆచూకీ లభ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News