Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

పోలవరం రైతు సంఘం నాయకుని మనవరాలు వినూత్న రాజశ్రీ భరత నాట్య కీర్తి

24-02-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికపై మెరిసిన వినూత్న రాజశ్రీ

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన రైతు సంఘం నాయకులు చాగంటి రాజారావు మనవరాలు, 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని వినూత్న రాజశ్రీ ప్రతిభకు రాష్ట్రస్థాయిలో ప్రశంసలు లభించాయి.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహించిన “భరత నాట్య వైభవం” కార్యక్రమంలో ఆమె అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. మొత్తం 108 మంది చిన్నారులు పాల్గొని మూడు గంటలపాటు సాగిన ఈ నృత్య మహోత్సవంలో

వినూత్న రాజశ్రీ తన లయ, భావ వ్యక్తీకరణ, నాట్య నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమె ప్రదర్శనకు సభలోని ప్రముఖులు, కళాభిమానులు ప్రశంసలు కురిపించారు.

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన చిన్నారి రాష్ట్ర రాజధానిలోని ప్రతిష్ఠాత్మక వేదికపై ప్రతిభ చాటడం స్థానికులకు గర్వకారణంగా మారింది. గ్రామ పెద్దలు, బీజేపీ ఏలూరు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చాగంటి వాసుదేవ రావు, రైతు సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు ఆమెకు అభినందనలు తెలిపారు.

Sthanikam

పోలవరం రైతు సంఘం నాయకుని మనవరాలు వినూత్న రాజశ్రీ భరత నాట్య కీర్తి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News