Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 06:02 PM

ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ నోటీసులపై కేసీఆర్ రిప్లై

29-01-2026 150 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన నోటీసులకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ లిఖితపూర్వకంగా స్పందించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పూర్తిగా బిజీగా ఉన్న కారణంగా, విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికల షెడ్యూల్ కారణంగా సిట్ ముందు హాజరుకాలేనని పేర్కొన్న కేసీఆర్, విచారణకు హాజరు కావడానికి మరో తేదీని ఖరారు చేయాలని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కు విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 160 ప్రకారం, 65 ఏళ్లు దాటిన వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు పిలవకూడదన్న చట్ట నిబంధనలను ఆయన గుర్తు చేశారు. తన వయస్సు 65 ఏళ్లు దాటిన నేపథ్యంలో, ఇంటివద్దే విచారణ జరపాలని కోరారు.

ప్రస్తుతం తాను సిద్ధిపేట జిల్లా మార్కుక్ మండలం ఎరవల్లి గ్రామంలో నివాసం ఉంటున్నట్టు తెలిపారు. అవసరమైతే అక్కడికే వచ్చి విచారణ నిర్వహించాలని సిట్‌ను కోరారు.

భవిష్యత్తులో జారీ చేసే నోటీసులన్నీ తన నివాస చిరునామాకే పంపాలని కూడా కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.

Sthanikam

ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ నోటీసులపై కేసీఆర్ రిప్లై

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News