Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:23 AM

ఫిబ్రవరి 23న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా విజయవంతం చేయాలి

22-02-2026 89 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (CITU) జిల్లా ప్రధాన కార్యదర్శి నకరేకంటి రాము

జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులందరూ ఫిబ్రవరి 23న కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించనున్న ధర్నాలో భారీగా పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (CITU) జిల్లా ప్రధాన కార్యదర్శి నకరేకంటి రాము పిలుపునిచ్చారు.

మండల కేంద్రంలో నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాన్ని నెలకు రూ.26,000గా నిర్ణయించాలని కోరారు. జి.ఓ నెం. 51ను రద్దు చేయాలని, కారోబార్ బిల్లులను కలెక్టర్లు సహాయ కార్యదర్శులుగా నియమించాలని, పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్‌గా రూ.5 లక్షలు చెల్లించడంతో పాటు ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, ఆన్లైన్‌లో నమోదు కాని కార్మికుల పేర్లను వెంటనే నమోదు చేయాలని కోరారు. విధి నిర్వహణలో మరణించిన కార్మికుల దహన సంస్కారాల కోసం రూ.30 వేల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో గ్రామపంచాయతీ నాయకులు బొడ్డు సాలయ్య, గాదె చంద్రయ్య, మంటి నాగరాజు, నకరికంటి పరశురాములు, బాచుపల్లి సైదులు, కే. వెంకటేశ్, మేడి రామచంద్రం, నాగస్వామి, నారపాక అందాలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫిబ్రవరి 23న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా విజయవంతం చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News