Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:04 AM

ఫామ్‌హౌస్ వివాదం హీట్ – ఎంపీపై సీఎం ఫైర్, పార్టీలో కలకలం!

ఫామ్‌హౌస్ వివాదం హీట్ – ఎంపీపై సీఎం ఫైర్, పార్టీలో కలకలం!

ఫామ్‌హౌస్ వివాదం హీట్ – ఎంపీపై సీఎం ఫైర్, పార్టీలో కలకలం!
March 18, 2026 07:20 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి, నారా చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా గట్టిగా స్పందించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఫామ్‌హౌస్ వివాదం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారడంతో… పార్టీ ఇమేజ్‌పై దెబ్బ పడుతోందంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇలాంటి వ్యవహారాలతో పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే వారిని మోయాలా?” అంటూ కఠినంగా ప్రశ్నించినట్లు సమాచారం.

మంగళవారం తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ మంత్రులతో జరిగిన కీలక సమావేశంలో సీఎం క్రమశిక్షణపై గట్టిగా సందేశం ఇచ్చారు. “పార్టీ విలువలు, నియమాలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించం” అంటూ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యాఖ్యలతోనే నేతల్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇదిలా ఉండగా, హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ప్రాంతంలో రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించడం కలకలం రేపింది. డ్రగ్స్ వినియోగంపై అనుమానంతో 11 మందికి పరీక్షలు నిర్వహించగా, ఆరుగురికి పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ఈ జాబితాలో ఎంపీ పుట్టా మహేష్ పేరు వినిపించడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నేపథ్యంలో ఎంపీ స్పందిస్తూ… తాను డిన్నర్ పార్టీకి మాత్రమే హాజరయ్యానని, ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. విచారణకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పినా… రాజకీయ వర్గాల్లో మాత్రం అనుమానాలు చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి.

మొత్తంగా ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలకలం రేపుతోంది. యువ నాయకుడిపై వచ్చిన ఈ వివాదం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందా? లేక త్వరలోనే క్లారిటీ వస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది. రాజకీయంగా ఈ ఎపిసోడ్ ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News