Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:15 PM

పీవీసీ పైపుల తయారీ విధానంపై ప్రత్యక్ష అవగాహన

04-02-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్ జి కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులు బుధవారం ఆర్మాల బాలి ప్రాంతంలో నెలకొల్పిన నిధి పీవీసీ పైపుల తయారీ పరిశ్రమను క్షేత్ర పర్యటనలో భాగంగా సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు పైపుల తయారీలో జరిగే వివిధ దశలను పరిశీలించి, పరిశ్రమ యాజమాన్యం మరియు సాంకేతిక నిపుణులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. తయారీ ప్రక్రియకు సంబంధించిన సందేహాలను పరిశ్రమ అధికారులు నివృత్తి చేశారు.తరగతి గదుల్లో నేర్చుకున్న సిద్ధాంతపరమైన అంశాలను క్షేత్రస్థాయిలో అవగాహన చేసుకునే ఉద్దేశంతో ఈ పర్యటనను ఏర్పాటు చేసినట్లు రసాయన శాస్త్ర విభాగాధ్యక్షుడు అంతటి శ్రీనివాస్ తెలిపారు.పైపుల తయారీలో ఉపయోగించే రెసిన్‌తో పాటు ఇతర రసాయన పదార్థాలను ఏ నిష్పత్తిలో కలుపుతారో విద్యార్థులు పరిశీలించారు. మిశ్రమాన్ని వేడి చేసి యంత్రాల ద్వారా పైపు ఆకారం ఎలా రూపుదిద్దుకుంటుందో ఉత్పత్తి ప్రక్రియను ప్రత్యక్షంగా చూశారు. తయారైన పైపుల దృఢత్వం, నాణ్యత నియంత్రణ పరీక్షల విధానాలను సాంకేతిక నిపుణులు వివరించారు.

అలాగే పరిశ్రమలో వ్యర్థాల నిర్వహణ, పర్యావరణానికి హాని కలగకుండా తీసుకుంటున్న జాగ్రత్తలపై విద్యార్థులు అవగాహన పొందారు.

ఈ క్షేత్ర పర్యటన విద్యార్థులకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉందని, పారిశ్రామిక రంగంపై అవగాహన పెంపొందించుకోవడానికి ఇలాంటి సందర్శనలు ఉపయోగపడతాయని కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ తెలిపారు.ఈ పర్యటనలో వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవికుమార్, అధ్యాపకులు బి. వెంకటేశ్వర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

పీవీసీ పైపుల తయారీ విధానంపై ప్రత్యక్ష అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News