Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:23 AM

పెండింగ్ లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం చేయాలి: కలెక్టర్ హనుమంతరావు

24-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం – అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

యాదాద్రి భువనగిరి: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి ఆయన వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన మొత్తం 54 అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, సంబంధిత శాఖలు క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రజావాణిలో అందిన అర్జీలలో రెవిన్యూ శాఖకు 26, పంచాయతీ శాఖకు 7, ఇరిగేషన్‌కు 5, విద్యుత్ శాఖకు 3, ఎంప్లాయిమెంట్ టీమ్‌కు 3, వ్యవసాయ శాఖకు 2, ఈఈ డివిజన్‌కు 2, మున్సిపాలిటీకి 2, గ్రామీణాభివృద్ధి శాఖకు 2, ఎస్సీ కార్పొరేషన్ మరియు సంక్షేమ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చినట్లు అధికారులు తెలిపారు.

వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను ఆలస్యం చేయకుండా పరిశీలించి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెంచే వేదికగా నిలవాలని, ప్రతి అర్జీపై బాధ్యతాయుతంగా స్పందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభ రాణి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పెండింగ్ లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం చేయాలి: కలెక్టర్ హనుమంతరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News