Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

పాఠశాల అభివృద్ధికి దాతల సహాయం అభినందనీయం సర్పంచ్ కాటం వెంకటేశం

05-02-2026 232 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెద్దకాపర్తి జెడ్పిహెచ్ఎస్‌లో విద్యార్థుల సౌకర్యానికి దాత

గ్రామీణ పాఠశాల అభివృద్ధికి ఆదర్శ సేవ

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రశంసనీయ కార్యక్రమం జరిగింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సౌకర్యంగా కూర్చునేందుకు దాత కామినేని దుర్గాకుమార్ బెంచీలను విరాళంగా అందజేశారు. ఈ విరాళం విలువ నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలుగా ఉంది.

పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ సేవకు గుర్తింపుగా గ్రామ పంచాయతీ తరఫున సర్పంచి కాటం వెంకటేశం కామినేని దుర్గాకుమార్‌ను ఘనంగా సన్మానించారు. విద్యా రంగంలో ఇలాంటి దాతల సహకారం అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు దాతను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చేసిన ఈ సేవ ఆదర్శంగా నిలిచిందని వారు అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు కందిమల్ల శివారెడ్డి, తాటి చంద్రమౌళి, ఉపసర్పంచి ఓర్సు సైదులు, ఏర్పు నరసింహ, ఏర్పుల యాదయ్య, సాగర్ల నవ్య శ్రీ, నాగరాజు, గంటల కవిత, తిరుమల్ రెడ్డి, తెలుసూరి నరసింహ, ఆనగంటి పూజ, నరేష్, నీలకంఠం, విజయ లింగస్వామి, మల్లేశ్వరి, వెంకటేశం, చేకూరి గణేష్, కృష్ణవేణి, జిల్లా ప్రశాంత్, మర్రి హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వచ్చే దాతల వల్ల గ్రామీణ ప్రాంతాల పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని స్థానికులు పేర్కొన్నారు.

Sthanikam

పాఠశాల అభివృద్ధికి దాతల సహాయం అభినందనీయం సర్పంచ్ కాటం వెంకటేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News