Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:23 AM

పట్టణ ప్రజలే నా బలం.. 48 సీట్లు మాకే: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

06-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

పట్టణ ప్రజలే నా బలం.. 48 సీట్లు మాకే: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ, ఫిబ్రవరి 6: నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా పలు డివిజన్లలో ప్రచారంలో పాల్గొన్న రోడ్లు, భవనాల శాఖ & సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో పట్టణ ప్రజలపై ప్రేమలోకొట్టుకున్నారు. "పట్టణ ప్రజలే నా బలం. నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎటువంటి ప్రచారం చేయకుంటేనే 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఈసారి కార్పొరేషన్ 48 వార్డులకు 48 మా కార్పొరేటర్ అభ్యర్థులు గెలుపొందుతారు" అని ఆయనధైర్యంగా ప్రకటించారు.

గడపగడపకు ప్రచార యాత్ర: ఈరోజుకార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా గడప గడపకు వెళ్తున్నానని మంత్రి తెలిపారు. "ప్రజల నమ్మకమే నా అసలు బలం. గతంలో ప్రచారం లేకుండానే ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చారు. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది" అని ఆయనఅభిప్రాయపడ్డారు. పట్టణ ప్రజల అభివృద్ధికి తన కట్టుబాటు హామీ ఇచ్చిన వెంకటరెడ్డి, రోడ్లు, భవనాలు, సినిమా పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని పునరుద్ఘాటించారు.

పవన్ కళ్యాణ్‌కు సలహా: పవన్కళ్యాణ్ జిల్లాలో పర్యటన గురించి మాట్లాడలేదని చెప్పిన మంత్రి, "ఆయన ఆంజనేయ స్వామి గుడికి వచ్చి దర్శించుకుంటే పవన్ కళ్యాణ్‌కు మంచిజరుగుతుంది" అని సరదాగా సలహా ఇచ్చారు. ఈ కామెంట్ మీడియా వర్గాల్లో నవ్వును రేకెత్తించింది.

విపక్షాలపై విమర్శ: "బిజెపి నల్గొండలో అసలు ఉందా? టీఆర్ఎస్, బిజెపి అన్ని పార్టీల దుకాణాలు బంద్ ఉన్నాయి" అంటూ విపక్షాలను తీవ్రంగా విమర్శించారు. "బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని వర్గాల ప్రజలు నా వెంటే ఉన్నారు. పట్టణ ప్రజల మద్దతతో కార్పొరేషన్ పూర్తిగా కాంగ్రెస్‌కు చెందుతుంది" అని కోమటిరెడ్డివెంకటరెడ్డి గెలుపు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలసమస్యల పరిష్కారంలో తన కృషి, పట్టణ అభివృద్ధికి కట్టుబాటు హామీలు చెప్పిన మంత్రి, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధిస్తుందని నమ్మకంగా పేర్కొన్నారు. నల్గొండ పట్టణం మొత్తం మంత్రి ప్రచారంలో మునిగి ఉంది.

Sthanikam

పట్టణ ప్రజలే నా బలం.. 48 సీట్లు మాకే: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News