Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

పశువైద్య వ్యవస్థ బలోపేతమే లక్ష్యం – మండలానికి ఒక పశువైద్యశాల అవసరం: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

24-02-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పశు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి – ప్రభుత్వ విప్ యార్లగడ్డ

వెటర్నరీ శాఖకు పూర్వవైభవం తీసుకురావాలని సభలో డిమాండ్

అసెంబ్లీ సమావేశాల్లో పశుసంవర్ధక శాఖ పనితీరుపై ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సుదీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్రంలో పశువైద్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు.

బ్రిటిష్ కాలంలో పటిష్టంగా ఉన్న వెటర్నరీ వ్యవస్థ కాలక్రమేణా ప్రాధాన్యత కోల్పోయి బలహీనపడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పశువైద్యశాలల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, కేవలం గోపాల మిత్రులు, పారామెడికల్ సిబ్బందితోనే వ్యవస్థ నడుస్తోందని వివరించారు. ప్రతి మండలానికి కనీసం ఒక పశువైద్యశాలను ఏర్పాటు చేసి, తగిన సంఖ్యలో వెటర్నరీ డాక్టర్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్తులో పశుపోషకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు.

గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ భవన ప్రహరీ గోడ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆయన విమర్శించారు. విదేశీ ప్రతినిధులు వచ్చినప్పుడు ఆ దృశ్యం రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుందని పేర్కొన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి హామీ ఇచ్చినట్లు వెంటనే నిధులు కేటాయించి ఆసుపత్రిని ఆధునీకరించాలని డిమాండ్ చేశారు.

2019 నుంచి 2024 మధ్య పశుసంవర్ధక శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని యార్లగడ్డ ఆరోపించారు. ఆ కాలంలో స్థానిక నేతలు, కొందరు అధికారులు, పోలీసుల అండతో ఒంగోలు గిత్తలు, ఆవులను అక్రమంగా కలకత్తా మార్గంగా బంగ్లాదేశ్‌కు తరలించారని తెలిపారు. లక్షల రూపాయల విలువైన పశువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమ రవాణా జరిపారని, దీనివల్ల రాష్ట్రంలో పశుసంపద తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం వెంటనే చెక్‌పోస్టులను బలోపేతం చేసి పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెటర్నరీ వ్యవస్థకు పూర్వవైభవం తీసుకురావాలని ఆయన సభ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.

Sthanikam

పశువైద్య వ్యవస్థ బలోపేతమే లక్ష్యం – మండలానికి ఒక పశువైద్యశాల అవసరం: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News