Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

పరీక్షలే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా చదవాలి – జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ

06-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ముందస్తు ప్రణాళికతో కష్టపడి చదవాలని జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ సూచించారు.శుక్రవారం భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా రెవెన్యూ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధన విధానం, పరీక్షల సన్నద్ధతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.

ప్రత్యేకంగా వెనుకబడిన విద్యార్థులతో సమావేశమై రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. వెనుకబడిన విషయాలను ప్రతిరోజు ఒకటికి రెండుసార్లు పునశ్చరణ చేయాలని, కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని ప్రోత్సహించారు.విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులపై మరింత దృష్టి సారించి ఫలితాలను మెరుగుపరచాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నాhరు.

Sthanikam

పరీక్షలే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా చదవాలి – జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ

Article Image

రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ముందస్తు ప్రణాళికతో కష్టపడి చదవాలని జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ సూచించారు.శుక్రవారం భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా రెవెన్యూ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధన విధానం, పరీక్షల సన్నద్ధతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.

ప్రత్యేకంగా వెనుకబడిన విద్యార్థులతో సమావేశమై రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. వెనుకబడిన విషయాలను ప్రతిరోజు ఒకటికి రెండుసార్లు పునశ్చరణ చేయాలని, కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని ప్రోత్సహించారు.విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులపై మరింత దృష్టి సారించి ఫలితాలను మెరుగుపరచాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నాhరు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News