Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

పరీక్షల విజయానికి పదెనిమిది సూత్రాలు – విద్యార్థులకు దిశానిర్దేశం.ఏనుగు నరసింహారెడ్డి

05-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, ఫిబ్రవరి 5:

ప్రముఖ బాల వైద్యుడు, మనోవైద్య నిపుణుడు, ప్రేరణాత్మక రచయిత డా. గుండ్లూరు సురేంద్రబాబు రచించిన “పరీక్షల్లో విజయం కోసం పదెనిమిది సూత్రాలు” అనే గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం నాంపల్లి లోని ఎస్పీఆర్ తెలుగు విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ ప్రాంగణంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ భాషా–సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి గ్రంథాన్ని ఆవిష్కరించారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం పరిరక్షణలో ఈ గ్రంథం ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ అప్పాల ప్రసాద్ జీ, ప్రాచీన భారతీయ ఆత్మనియంత్రణ పద్ధతులు, ఒత్తిడి నియంత్రణ, ఏకాగ్రత పెంపొందించే మార్గాలు, భావోద్వేగ సమతుల్యతపై చేసిన ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది.శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర మాట్లాడుతూ, ఈ గ్రంథం విద్యార్థులకు ఆచరణాత్మక మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.తెలంగాణ మనోవైద్యుల సంఘం ఉపాధ్యక్షులు డా. ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రచయిత ఒక వైద్యుడిగా ఎంతో శ్రమించి సరళమైనా శక్తివంతమైన పదెనిమిది సూత్రాలను ఈ గ్రంథం ద్వారా అందించారని తెలిపారు. ఇవి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా మార్గనిర్దేశకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇటీవల గణాంకాల ప్రకారం విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, ఈ గ్రంథం ధైర్యం, ఆశ, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించగలదని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా డా. వి. త్రివేణి, డా. పెద్దింటి అశోక్ కుమార్, డా. శ్రీభాష్యం శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. హయత్‌నగర్ గ్రంథపాలకులు డా. దుర్గాప్రసాద్ హాజరై రచయితకు అభినందనలు తెలిపారు. స్వాగతం మరియు కృతజ్ఞతలను శ్రీమతి కె. విజయలక్ష్మి తెలియజేశారు.

Sthanikam

పరీక్షల విజయానికి పదెనిమిది సూత్రాలు – విద్యార్థులకు దిశానిర్దేశం.ఏనుగు నరసింహారెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News