Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
05-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చెట్టును కాపాడితే భవిష్యత్తు భద్రం

పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం మొక్కలు నాటడమే కాదని, జీవన విధానాన్ని ప్రకృతికి అనుకూలంగా మార్చుకోవడమే అసలైన పరిరక్షణ అని ప్రముఖ పర్యావరణ వేత్త సురేష్ గుప్త స్పష్టం చేశారు. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఎకో క్లబ్, వృక్షశాస్త్ర విభాగం, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘తల్లి చెట్టు’ పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించకుండా పర్యావరణ రక్షణ నినాదాలు చేయడం ప్రయోజనం లేదన్నారు. ఆహార అలవాట్లు, దుస్తులు, నివాస విధానాలు అన్నీ పర్యావరణహితంగా ఉండాలని, ఆ దిశగా విద్యార్థులు ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. చెట్లు లేకపోతే మనిషి మనుగడ లేదని, చెట్టును కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ఆయన స్పష్టం చేశారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ, కళాశాల విద్య కమిషనర్ ఆదేశాలు, గ్రీన్ విప్లవ మండలితో చేసుకున్న ఒప్పందం మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత పుడమిని అందించాలంటే చెట్ల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. కళాశాల ప్రాంగణంలోని అత్యంత పురాతన చెట్టును ‘తల్లి చెట్టుగా’ గుర్తించి పూజించడం విద్యార్థుల్లో పర్యావరణ స్పృహను పెంచుతుందని పేర్కొన్నారు.

అనంతరం విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు, జాతీయ సేవా పథకం వాలంటీర్లు, ఎకో క్లబ్ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News