Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:23 AM

పర్యాటక మాస్టర్ ప్రణాళికకు వేగం.అదనపు కలెక్టర్ భాస్కరరావు

24-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కీలక ప్రాంతాల అభివృద్ధికి రెండు రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

జిల్లాలో పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు ముమ్మరమయ్యాయి. పర్యాటక మాస్టర్ ప్రణాళిక తయారీలో భాగంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రెండు రోజులలోపే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన రాచకొండ కోట, భువనగిరి కోట, మహదేవ్‌పూర్‌, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, కొలనుపాక జైన దేవాలయం, మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తదితర ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు.

పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ఎం/ఎస్ వోయంట్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించనుందని వెల్లడించారు.

సమావేశంలో పర్యాటక అధికారి ధనంజనేయులు, సహాయ సంచాలకుడు ఓంప్రకాశ్, రామమూర్తి, పోచంపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యాటక మాస్టర్ ప్రణాళికకు వేగం.అదనపు కలెక్టర్ భాస్కరరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News