Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:18 PM

ప్రతిభకు ప్రోత్సాహం.. నేహాశ్రీకి నగదు పురస్కారం!

13-04-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్ర స్థాయి ర్యాంకర్ కు రూ. 10,000 ఆర్థిక సాయం

మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్, కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్

కృషి ఉంటే విద్యార్థులు అసాధ్యాలను సుసాధ్యం చేస్తారని, అపార ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన తోర్పునూరి నేహాశ్రీని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నేహాశ్రీ 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన విద్యార్థినిని ప్రోత్సహించే ఉద్దేశంతో 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ ముందుకు వచ్చారు. చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ చేతుల మీదుగా నేహాశ్రీకి రూ. 10,000 ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు గొప్ప ఫలితాలు సాధించడం గర్వకారణమని, నేహాశ్రీ విజయం తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రతినిధులు, విద్యార్థిని తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతిభకు ప్రోత్సాహం.. నేహాశ్రీకి నగదు పురస్కారం!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News