Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:19 PM

ప్రశాంత్ నగర్‌లో కార్పొరేటర్ మార్నింగ్ వాక్, కాలనీ సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన

05-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం డిప్యూటీ కమిషనర్ వంశీ కృష్ణతో కలిసి ప్రశాంత్ నగర్ కాలనీలో ఉదయపు నడకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, హుడా పార్క్ పరిస్థితి తదితర సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు.కాలనీ వాసులు కార్పొరేటర్‌కు తమ సమస్యలను నేరుగా వివరించారు. ముఖ్యంగా రహదారులు చెదిరిపోయి ప్రమాదకరంగా మారాయని, సరైన డ్రైనేజీ లేక మురుగు నీరు నిలిచిపోతుందని, హుడా పార్క్ అభివృద్ధి అవసరమై ఉందని తెలిపారు. వీధి కుక్కల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై కూడా వారు దృష్టికి తీసుకొచ్చారు.ఈ సమస్యలపై కార్పొరేటర్ సంబంధిత అధికారులతో అక్కడికక్కడే చర్చించి, ప్రాధాన్యత క్రమంలో పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధికి అవసరమైన పనులు త్వరితగతిన ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామారావు, ఇంజనీర్ నాగేందర్, డీఈ కనకాయ, వాటర్ వర్క్స్ ఏఈ సాయి శ్రీనివాస్, ఏఎంహెచ్ఓ నీలిమ, ఎలక్ట్రికల్ డీఈ పవని, ఏఈ విఘ్నేశ్వరి, వర్క్ ఇన్‌స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు.అలాగే ప్రశాంత్ నగర్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, కార్యదర్శి యూవీఎన్ బాబు, అభ్యుదయ నగర్ కాలనీ అధ్యక్షుడు గంగా రెడ్డి, మల్లికార్జున్ నగర్ అధ్యక్షుడు నర్సి రెడ్డి, క్రిస్టిన్ కాలనీ అధ్యక్షుడు హరిందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, యుగేందర్ రెడ్డి, బాలాజీ నాథ్, నరసింహ రెడ్డి, గోవర్ధన్, అంజయ, రవికాంత్, డీజేఎం రెడ్డి, శ్రీధర్ గౌడ్ తదితర ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కాలనీ నివాసులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రశాంత్ నగర్‌లో కార్పొరేటర్ మార్నింగ్ వాక్, కాలనీ సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News