Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 11:41 AM

ప్రపంచ క్యారమ్ విజేత శ్రీనివాస్‌కు సన్మానం

23-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహేశ్వరం నియోజకవర్గంలో ప్రపంచ స్థాయి క్యారమ్ క్రీడాకారుడు శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ ద్వారా అనేక మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారని పేర్కొన్నారు. క్యారమ్ క్రీడలో శ్రీనివాస్ సాధించిన విజయాలు యువతకు ఆదర్శమని కొనియాడారు.

ప్రపంచ స్థాయిలో పలు సార్లు విజేతగా నిలిచి దేశానికి గౌరవం తీసుకువచ్చిన ఆయన, ఇటీవలి పోటీల్లోనూ ప్రతిభ చాటడం అభినందనీయమన్నారు. సీఎం కప్‌లో విజేతగా నిలవడం మహేశ్వరం ప్రాంతానికి గర్వకారణమని తెలిపారు.

యువత క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులకు అవసరమైన సహకారం అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు.

కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, క్రీడా ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రపంచ క్యారమ్ విజేత శ్రీనివాస్‌కు సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News