Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:17 AM

ప్రామాణిక పాఠ్యక్రమాల కరపత్రం విడుదల

ప్రామాణిక పాఠ్యక్రమాల కరపత్రం విడుదల

ప్రామాణిక పాఠ్యక్రమాల కరపత్రం విడుదల
23-02-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్లో వివిధ ప్రామాణిక పాఠ్యక్రమాలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమం హయత్‌నగర్లో నిర్వహించబడింది.

కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ పి. సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాఠ్యక్రమాల వివరాలను విద్యార్థులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం, ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం ఈ పాఠ్యక్రమాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

పాఠ్యక్రమాల సమన్వయకర్త డాక్టర్ ఎస్. శారదా దేవి మాట్లాడుతూ కోర్సుల వ్యవధి, అమలు విధానం, ప్రవేశానికి సంబంధించిన నియమాలను వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వృత్తి జీవితానికి బలమైన పునాది వేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప ప్రధానాచార్యులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి ఇందిరా, అంతర్గత నాణ్యత పరిరక్షణ విభాగ ప్రతినిధులు, వివిధ శాఖాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రామాణిక పాఠ్యక్రమాల కరపత్రం విడుదల

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News