Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:28 PM

ప్రజా కళాకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలి...

13-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

గుర్తింపు కార్డుల కోసం కలెక్టరేట్ ఎదురుగా కళాకారుల భారీ ధర్నా..

అర్హులైన ప్రజా కళాకారులకు గుర్తింపు కార్డులు మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్ద శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లాలోని కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్, దామోదర్ రెడ్డి మాట్లాడుతూ...ప్రజానాట్య మండలి కళాకారులు అనేక సంవత్సరాలుగా గుర్తింపు లేకుండా, సరైన పారితోషికం లేకుండా,సామాజిక భద్రత లేకుండా దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారని, కళాకారుల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం తాగదని,ప్రభుత్వ కార్యక్రమాల్లో కళాకారులను ఉపయోగించుకుంటూ,తరువాత వారికి కనీస గౌరవ వేతనం కూడా ఇవ్వకపోవడం అన్యాయం అని, వెంటనే ప్రతి కళాకారులకు గుర్తింపు కార్డు జారీ చేసి,కనీస పారితోషికాన్ని చట్టబద్ధం చేయాలని,ప్రమాద బీమా,ఆరోగ్య బీమా,పెన్షన్ వంటి భద్రతా పథకాలు తక్షణమే అమలు చేయాలని, జిల్లా కేంద్రంలో ప్రత్యేక సాంస్కృతిక భవనం నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి భూషిపాక నర్సింహా,చెక్క వెంకటేష్ మాట్లాడుతూ 50 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి రూ.6 వేలు పెన్షన్ ఇవ్వాలని,సంస్కృతిక రంగానికి ప్రత్యేకంగా వెయ్యికోట్ల బడ్జెట్ కేటాయించాలని, దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో వృత్తి కళాకారులకు ప్రదర్శన అవకాసం కల్పించాలని, వృత్తి కళాకారులకు అవసరమైన పరికరాలను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రుణాలు ఇవ్వాలని,యువతను సాంస్కృతిక రంగంలోకి ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని,మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే,తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో చిరుర్ల లింగం,మూల పోచయ్య, పిట్టల శంకర్,కట్ల యాదగిరి,సోమ నరసయ్య,ఇంజ హేమలత,శ్రీనివాస్,రాజప్ప,మల్లేశం,సరిత,దుప్పెల్లి చౌదరి,రేణుక,సుగుణమ్మ, కృష్ణమ్మ,కవిత,ఎలేంద్ర,రేణుక, సామి,శంకరయ్య,పద్మ,చంద్రారెడ్డి,తేజ,లక్ష్మయ్య,మల్లేశం,అన్నేమైన వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా కళాకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలి...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News