Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

పారదర్శక మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఆదేశాలు.రాణి కుముదిని

06-02-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా పూర్తి పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా రాజీపడే పరిస్థితి ఉండకూడదని, చిన్న తప్పిదానికీ తావివ్వకుండా అధికారులు

అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో సమావేశంలో ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాల పరిశీలకులు, కలెక్టర్లు, ఎస్పీలతో కమిషనర్ సమీక్షించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే క్షేత్రస్థాయిలో పటిష్ట నిఘా అవసరమని పేర్కొన్నారు. అక్రమ మద్యం, నగదు పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.రాష్ట్ర డీఐజీ మహేష్ భగవత్ ఎన్నికల వేళ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు తావులేకుండా ప్రత్యేక బృందాలతో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, సమస్యాత్మక ప్రాంతాల్లో బలమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు మున్సిపాలిటీల పరిధిలో 104 వార్డులకు 212 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసినట్లు జిల్లా అధికారులు వివరించారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు

Sthanikam

పారదర్శక మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఆదేశాలు.రాణి కుముదిని

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News